News August 28, 2024
జైలుకు పంపి నన్ను జగమోండిని చేశారు: MLC కవిత

తీహర్ జైలు నుంచి విడుదలైన తర్వాత MLC కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తనను అనవసరంగా జైలుకు పంపి జగమెుండిని చేశారన్నారు. ‘నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. మెుండిదాన్ని.. మంచిదాన్ని’ అని పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో చెల్లిస్తానని అన్నారు.
Similar News
News February 9, 2026
NZB: ఎలక్షన్ ఎఫెక్ట్.. 162 మంది బైండోవర్

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో 162 మందిని సంబంధిత తహశీల్దార్ల ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించిన వారిపై టౌన్-1, టౌన్-3, బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
News February 9, 2026
NZB: 1,500 మంది సిబ్బందితో బందోబస్తు: సీపీ

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 3 ప్లాటున్ల TSSP సిబ్బంది , స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
News February 9, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


