News March 30, 2025

జైలులో మహిళా ఖైదీ సూసైడ్

image

ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారి అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

ఈనెల 17 నుంచి జిల్లాలో పోషణ మాసోత్సవాలు: కలెక్టర్

image

ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది ప్రమాదకరంగా మారిందన్నారు.

News September 16, 2025

సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

image

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.

News September 16, 2025

ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.