News April 8, 2025
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్ఛార్జిలు వీరే!

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్ఛార్జిలను డీసీసీ అధ్యక్షుడు అశోక్ నియమించారు. ములుగు మండలం రవి, సత్తిరెడ్డి, బిక్షపతి, వెంకటాపూర్ రవిచందర్, భగవాన్ రెడ్డి, గోవిందరావుపేట కళ్యాణి, తాడ్వాయి సోమయ్య, మల్లంపల్లి రాజేందర్, ఏటూరునాగారం సురేంద్రబాబు, కన్నాయిగూడెం దేవేందర్, మంగపేట మండలం వెంకన్న, గంగారం మొగిలి, కొత్తగూడ రూప్ సింగ్, వెంకటాపురం రమేష్ బాబు, వాజేడు విక్రాంత్ను ఎంపిక చేశారు.
Similar News
News December 4, 2025
BREAKING: తిరుపతిలో ఒకరి మృతి

తిరుపతిలో గురువారం విషాద ఘటన జరిగింది. గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకి చనిపోయాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని మీసేవ కేంద్రం ఎదురుగా ఈ ఘటన వెలుగు చూసింది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. అతని వివరాలు తెలిస్తే అలిపిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News December 4, 2025
SBIలో 996 పోస్టులకు నోటిఫికేషన్

SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్లో 43, అమరావతిలో 29 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sbi.bank.in
News December 4, 2025
కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి?: MP

TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సభలో BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ‘ఇది చిన్న విషయంగా నవ్వుతారు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద సమస్య. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారింది. సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని జనం అంటున్నారు. కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలి’ అని కోరారు.


