News May 18, 2024
జొన్నగిరిలో గ్రామ పొలాల్లో వజ్రాల వేట ప్రారంభం

కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరి గ్రామ పొలాల్లోకి వెళ్లి వజ్రాల అన్వేషణ ను శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఆశలు చిగురించి ఈఏడాది జనం భారీగా పొలాల్లోకి తరలి వస్తున్నారు.
Similar News
News October 19, 2025
జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
దీపావళి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ వేదిక రద్దు: కలెక్టర్

దీపావళి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ వేదిక రద్దు చేసినట్లు కలెక్టర్ సిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 20 (సోమవారం)న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దయిందని తెలిపారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News October 18, 2025
ఆడపిల్లలకు చదువుకునే హక్కు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి: కలెక్టర్

ఆడపిల్లలందరికీ చదువుకునే హక్కు తప్పకుండా ఇవ్వాలని, వారికి పౌష్టికాహారం అందించి, సమాజంలో లింగ వివక్ష లేకుండా చూడాలని ఇవాళ కలెక్టర్ సిరి అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో అన్నారు. జిల్లాలో కేవలం 56 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతంకి పెంచాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో రాణించాలని, విద్యకు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అందిస్తోందని, బాలికల రక్షణకు ‘స్త్రీ శక్తి’ యాప్ ఉందని పేర్కొన్నారు.