News May 18, 2024

జొన్నగిరిలో గ్రామ పొలాల్లో వజ్రాల వేట ప్రారంభం

image

కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరి గ్రామ పొలాల్లోకి వెళ్లి వజ్రాల అన్వేషణ ను శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఆశలు చిగురించి ఈఏడాది జనం భారీగా పొలాల్లోకి తరలి వస్తున్నారు.

Similar News

News December 11, 2024

భూమా దంపతులు ఉంటే ఇలా మాట్లాడేవారా?: మంచు మనోజ్

image

భూమా మౌనికకు తల్లిదండ్రులు ఉంటే తన తండ్రి ఇలా ప్రవర్తించే వారా? అని మంచు మనోజ్ ప్రశ్నించారు. ‘భూమా మౌనికను ప్రేమించా. పెళ్లి చేసుకున్నా. అందులో తప్పేముంది. నా భార్య వచ్చాక చెడ్డోడిని అయ్యానంటున్నారు. తాగుడికి బానిసయ్యానని మాట్లాడుతున్నారు. మౌనికకు తల్లిదండ్రులు ఉంటే ఇలా మాట్లాడేవారా. ఇప్పుడు ఆమెకు తల్లీ, తండ్రి అన్నీ నేనే. నా భార్య కష్టపడే వ్యక్తి. నిజాలు తర్వలో తెలుస్తాయి’ అని చెప్పారు.

News December 11, 2024

అన్నదాతకు అండగా ఉద్యమిస్తాం: కాటసాని

image

అన్నదాతలకు అండగా నిలబడి ఉద్యమిస్తామని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు.

News December 11, 2024

నందికొట్కూరులో బాలికకు నిప్పు ఘటనలో బిగ్ ట్విస్ట్

image

నందికొట్కూరులో బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. లహరి (17) మృతికి అగ్నిప్రమాదమే కారణమని జిల్లా ఎస్పీ అధిదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. లహరి, రాఘవేంద్ర ఇంట్లో ఉన్న సమయంలో దోమల కాయిల్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందన్నారు. గదిలో ఉన్న టర్పెంట్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.