News July 26, 2024

జొన్నాడ టోల్ గేటు తరలించాలని కేంద్రమంత్రికి లేఖ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లేఖ రాశారు. జొన్నాడ సమీపంలోని ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రహదారిలోకి తరలించాలని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. జొన్నాడ టోల్ గేట్ వలన వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News December 15, 2025

ఎస్‌.కోట సబ్ జైలును తనిఖీ చేసిన ప్రధాన న్యాయమూర్తి

image

ఎస్.కోట సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది లేదా తోటి ఖైదీలు వివక్ష చూపరాదని, అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఖైదీలను ఉద్దేశించి నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా మారాలని హితవు పలికారు.

News December 15, 2025

VZM: ‘చిన్న పత్రికలకు చేయూత ఇవ్వాలి’

image

చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అక్రిడిటేషన్ సంఖ్య పెంపునకు ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్న విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.

News December 14, 2025

VZM: ఎంపికైన కానిస్టేబుళ్లకు ముఖ్య గమనిక..

image

విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం 5 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరుకావాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సూచించారు. అభ్యర్థితో పాటు వారి తల్లిదండ్రులు, సమీప బంధువులు ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు, కుటుంబసభ్యులకు పోలీసు శాఖ టిఫిన్, భోజన సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. పురుష అభ్యర్థులు నీట్ షేవింగ్‌తో రావాలని సూచించారు.