News March 19, 2024
జొన్న సేకరణకు రిజిస్టేషన్ ప్రారంభం

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి జొన్న, మొక్కజొన్న సేకరణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు జొన్న పంట ఒక క్వింటాకు రూ.3180, మొక్కజొన్న పంట క్వింటాకు రూ.2090 కనీస మద్దతు ధరగా ప్రకటించారు.
Similar News
News December 21, 2025
పెంచలకోనలో విశేష పూజలు

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News December 20, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9552300009 మనమిత్ర వాట్సాప్ సేవలను అందబాటులోకి తెచ్చిందన్నారు. ఈ-చలానా చెక్, ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్, కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. దీని వలన ప్రజల సమయం ఆదాకావడంతోపాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవుతారు.
News December 20, 2025
పల్స్ పోలియోపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ

పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి గుప్తా పార్కు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2,94,604 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించనున్నామన్నారు. 21 నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.


