News March 19, 2024
జొన్న సేకరణకు రిజిస్టేషన్ ప్రారంభం
జిల్లావ్యాప్తంగా నేటి నుంచి జొన్న, మొక్కజొన్న సేకరణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు జొన్న పంట ఒక క్వింటాకు రూ.3180, మొక్కజొన్న పంట క్వింటాకు రూ.2090 కనీస మద్దతు ధరగా ప్రకటించారు.
Similar News
News September 15, 2024
మనుబోలులో వినాయక ఉత్సవంలో అపశ్రుతి.. 30మందికి గాయాలు
మనుబోలు బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో ఇవాళ సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవం కోసం తెచ్చిన తారాజువ్వలపై నిప్పు రవ్వలు పడిన ఘటనలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2024
నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గూడూరు మండలం చెన్నూరు గిరిజన కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని తూపిలిపాళెం సముద్రంలో నిమర్జనం చేసి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News September 15, 2024
నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.