News May 19, 2024
జోగులాంబను దర్శించుకున్న విద్యాశాఖ డైరెక్టర్లు
ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యాదగిరి(మల్టీ జోన్ 2), మల్టీ జోన్ 1 డైరెక్టర్ జాయింట్ రాజేందర్ సింగ్, అలాగే తెలంగాణా డిగ్రీ పీజీ కళాశాలల ప్రిన్సిపల్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు దర్శనాలు చేయించారు. వీరితోపాటు డిగ్రీ కళాశాల లెక్చరర్ పిండి కృష్ణమూర్తి ఉన్నారు.
Similar News
News December 5, 2024
జడ్చర్ల: బాలికను గర్భవతిని చేసిన యువకుడు
ఓ బాలిక(17)ను గర్భవతిని చేశాడు ఓ యువకుడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ తిరిగేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఆమెపై పలు సార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకొమని అడగగా మొహం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2024
నాగర్‌కర్నూల్: కుళ్లిపోయిన మహిళ మృతదేహం
అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రకారం.. NGKL జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన మరియమ్మ(40) తన భర్తతో భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా కుళ్లిన స్థితిలో మరియమ్మ మృతదేహం కనిపించింది. భర్తే హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
News December 5, 2024
GREAT: 4 ‘GOVT’ ఉద్యోగాలు సాధించిన మమత
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ కుమార్తె మమత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో కేజీబీవీ లెక్చరర్‌గా, 2024లో గురుకుల జూనియర్ లెక్చరర్‌గా, ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించి గెజిటెడ్ పోస్ట్‌ను దక్కించుకుంది. భర్త సుకుమార్ గౌడ్ ప్రోత్సాహంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.