News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News February 24, 2026

ఖమ్మం చెంతకు ‘కలియుగ వైకుంఠం’..!

image

ఖమ్మం ధంసలాపురంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆలయంతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తుమ్మల వెల్లడించారు.

News February 24, 2026

కాసేపట్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 గంటల్లో గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రాత్రంతా హైదరాబాద్‌లో <<19222449>>భారీ వర్షం<<>> కురిసిన విషయం తెలిసిందే.

News February 24, 2026

నేడు నాగర్‌కర్నూల్‌లో టెన్షన్.. టెన్షన్..!

image

కుమ్మెర ఘటన నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే BRS, CPM, BSP, TRP, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ, MRPS, బీసీ సంఘాల నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. అయితే 8 మంది నిందితుల్లో ముగ్గురినే పోలీసులు అరెస్ట్ చేశారని వారంటున్నారు. కాగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిన్న కాంగ్రెస్ జిల్లా చీఫ్, MLA వంశీకృష్ణ తెలిపారు. నేడు BJP స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు NGKLకు రానుండగా టెన్షన్ నెలకొంది.