News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News February 19, 2025

భువనగిరి జిల్లా టాప్ న్యూస్

image

☞ ఈనెల 23న యాదాద్రికి సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన ☞ చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం ☞ భువనగిరిలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన ☞ సుందరంగా ముస్తాబైన యాదాద్రి క్షేత్రం ☞ భువనగిరి కలెక్టర్‌కు ఇన్విటేషన్ ☞ HYD బోడుప్పల్‌లో విగ్రహ ప్రతిష్ఠలో కోమటిరెడ్డి, బీర్ల☞ గుండాలలో నీటి ఎద్దడి

News February 19, 2025

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

అద్దంకి మండలం వేణుగోపాలపురం సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. కట్టెల ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ఉన్న తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ఏనికపాటి ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది అతన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

News February 19, 2025

నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

image

TG: నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 120 ఎకరాల్లో మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూలతండా వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రధాన డ్యామ్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

error: Content is protected !!