News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News February 9, 2025

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

News February 9, 2025

సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు

image

గత నెలలో తూప్రాన్‌లో నిర్వహించిన SGF అండర్‌ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.

News February 9, 2025

UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయింది వీరే

image

డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులో శనివారం సాయంత్రం కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆర్యనగర్‌కు చెందిన గణేశ్, నరేశ్, రమేశ్, జగన్‌గా గుర్తించారు. కరీంనగర్ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మారంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. గాయాలైన యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.

error: Content is protected !!