News January 26, 2025
జోగులాంబ అమ్మవారి సేవలో సినీ ప్రముఖులు

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఇవాళ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ, పోతుగల్ సినిమా హీరో ఉభయ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు అందించి ఆలయం స్థల పురాణం వివరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. అనంతరం తుంగభద్ర పుష్కర ఘాట్ నదిని వీక్షించారు.
Similar News
News February 23, 2026
జగిత్యాల: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

రాబోయే గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల నుంచి కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఘాట్ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాల ఏర్పాటు చూడాలన్నారు.
News February 23, 2026
పల్నాడు: ఉద్యోగం పేరిట రూ.లక్షల్లో మోసం..!

గుండ్లపల్లికి చెందిన యువకుడు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకొచ్చింది. బాధిత యువకుడు నరేష్‌కు జాబ్ ఇప్పిస్తానని చెన్నైకు చెందిన నిందితుడు అరుణ్ నమ్మబలికించాడు. దీంతో అతను అరుణ్ ఖాతాకు ఆన్లైన్ ద్వారా రూ.6.30లక్షలు చెల్లించాడు. ఉద్యోగం కల్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ‘మా బాబాయి మంత్రి’ అంటూ సాకులు చెప్పి ఫోన్ బ్లాక్ చేశాడన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు SPకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
News February 23, 2026
28న గన్నవరంలో జాబ్ మేళా

ఈనెల 28న ఉదయం 9 గంటలకు గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు సోమవారం తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-35 ఏళ్ల వయసున్నవారు పాల్గొనవచ్చన్నారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పిస్తాయని పేర్కొన్నారు.


