News February 14, 2025
జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని వినతి

జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని NSUI జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి సోమరాజుకు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుంచి జోగులాంబ ఆలయం, పాగుంట ఆలయాలకు అధికారిగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. ఆలయ EO అధికార దుర్వినియోగం చేస్తున్నాడని తెలిపారు.
Similar News
News November 15, 2025
ఆర్ఎస్ఎస్ శతాబ్ది పథసంచలన్‌కు ఎస్పీకి ప్రత్యేక ఆహ్వానం

ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది పథసంచలన్ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కుమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ ఆహ్వానం అందించిన వారిలో ఖండ కార్యవాహ గుండేటి కోటేశ్వరరావు, వ్యవస్థ ప్రముఖ్ వేణుగోపాల్, సంపర్క ప్రముఖ్ నాగుల శ్రీనివాస్, న్యాయవాది భోనగిరి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
News November 15, 2025
ఉండవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు

ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో కోళ్ల వ్యాన్ బోల్తా పడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా డ్రైవర్ హుస్సేన్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది. దీంతో హుస్సేన్‌తో పాటు క్లీనర్ మాలిక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. బ్లూ కోట్ వీధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
News November 15, 2025
అన్నమయ్య: విద్యుత్ శాఖలో ఎస్ఈ బాధ్యతలు చేపట్టిన సోమశేఖర్ రెడ్డి

శనివారం అన్నమయ్య జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్‌గా సోమశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈయన నెల్లూరులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేశారు. అన్ని డివిజన్ల ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, యూనియన్లు శుభాకాంక్షలు తెలిపారు. సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్య బాధ్యతన్నారు. అన్ని విభాగాలు డిస్కం స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.


