News February 10, 2025
జోగులాంబ: ఐదుగురు డ్రైవర్ల పై కేసులు నమోదు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 5 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News March 12, 2025
రేవంత్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: కేటీఆర్

TG: ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్ధికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
News March 12, 2025
HYD: విద్యాశాఖ చివరి నుంచి పోటీపడే పరిస్థితి: సీఎం

HYDలోని రవీంద్రభారతిలో ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యమిచ్చే విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించామని, గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యాశాఖలో చివరి నుంచి పోటీపడే పరిస్థితికి తెలంగాణ దిగజారిందని, విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం, అవమానకరమన్నారు.
News March 12, 2025
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్దేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి మంత్రి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు శ్రీనివాస వర్మ వాహనాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి తల, కాలుకు గాయాలయ్యాయి. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.