News January 22, 2025
జోగులాంబ: కార్మికుల పోరాటం వల్లే ధరల పెరుగుదల: సీఐటీయూ

జోగులాంబ: కార్మిక సంఘాల పోరాటాల ఫలితానికి ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో కార్మికులు రిలే దీక్ష చేయడంతో ప్రభుత్వం ధరలను పెంచిందని ఆయన అన్నారు. ఆయన వెంట ఉప్పేరు నరసింహ ఉన్నారు.
Similar News
News November 18, 2025
ప్రీమియర్ అగ్రితో ఏమిటి సంబంధం..!

కల్తీ నెయ్యి కేసులో A-24 చిన్ని అప్పన్నను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రీమియర్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్తో సంబంధం ఏమిటి? నీకు రూ.50 లక్షలు ఎందుకు ఇచ్చారు? కమీషన్ రూపంలో తీసుకున్న డబ్బు ఎవరికి ఇచ్చారనే కోణంలో విచారించారు. అన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
News November 18, 2025
రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.
News November 18, 2025
ములుగు: పోలీసుల అదుపులో దేవ్ జీ..?

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఉన్నట్లు తెలుస్తోంది. మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీతో పాటు మరి కొంత మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వినవస్తుంది. రేపు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.


