News April 7, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా 37 ఫిర్యాదులు వెల్లువ @అయిజ మండలం యాపదిన్నె గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పశు బల ప్రదర్శన బండ్ల గిరక పోటీలు @కేటిదొడ్డి మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @ గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది అందజేత @రేషన్ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని బీజేపీ డిమాండ్.
Similar News
News April 25, 2025
KNR: మోకాళ్లపై కూర్చుని నిరసన

శాతవాహన విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్ట్ & పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె 4వ రోజుకు చేరింది. 4వ రోజు సమ్మె శిబిరంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ మోకాళ్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ & పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరిని వన్ టైం సెటిల్మెంట్ గా రెగ్యులరైజ్ చెయ్యాలన్నారు.
News April 25, 2025
అల్లు అర్జున్ సినిమాలో మృణాల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
News April 25, 2025
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవస్థలు కుదేలు: శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని సంక్షేమ పథకాల అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చలో వరంగల్ సభను విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ, నాయకులు పాల్గొన్నారు.