News April 8, 2025

జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ @జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు @రాజోలి మండల కేంద్రంలో పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య @నేడు గుజరాత్‌కు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

Similar News

News December 1, 2025

WGL: మార్కెట్‌కి పల్లికాయ రాక.. ధర ఎంతంటే..?

image

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పచ్చి పల్లికాయ రూ.6,350 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మొక్కజొన్నకు రూ. 1,935 ధర వచ్చిందన్నారు. గతవారం మక్కలు బిల్టికి రూ.2000 పైగా ధర రాగా.. నేడు ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

News December 1, 2025

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

image

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.

News December 1, 2025

NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

image

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.