News April 10, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలి: కలెక్టర్ @గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం @ అయ్యప్ప స్వామి నూతన కమిటీ ఏకగ్రీవం @ రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు: ఎస్పీ @గద్వాల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Similar News
News December 1, 2025
కాంగ్రెస్కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్కు ఆ పార్టీ MP శశిథరూర్కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 1, 2025
జగిత్యాల: 3,536 పోలింగ్ స్టేషన్లకు 110 మైక్రో అబ్జర్వర్లు

జగిత్యాల జిల్లా కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్ర కీలకమని, చెక్లిస్ట్ ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 3,536 స్టేషన్లకు 110 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించినట్టు తెలిపారు. సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
News December 1, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.


