News April 19, 2025

జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@ ధరూరు : రేపు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక @ గద్వాల్ : మంత్రి రాక సభను పరీక్షించిన అధికారులు @ గద్వాల్ : బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి
@ గద్వాల్ : కోట చరిత్ర మీకు తెలుసా..
@ ఉండవల్లి : ఫ్లై ఓవర్ నిర్మించండి
@ అలంపూర్ : ప్రధాన రహదారిపై గుంత
@ కేటి దొడ్డి : మందకృష్ణ ఈనెల 27న రాక
@ గద్వాల్ : శక్తిపీఠంలో చండి హోమాలు.

Similar News

News April 20, 2025

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

image

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <>నోటిఫికేషన్ విడుదలైంది.<<>> జూన్ 10 నుంచి 18 వరకు బెంగళూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. రేపటి నుంచి మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2005 జనవరి 1 నుంచి 2008 జులై 1 మధ్యలో జన్మించి, టెన్త్ పాసైన వారు అర్హులు.
వెబ్‌సైట్:https://agnipathvayu.cdac.in/

News April 20, 2025

రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 20, 2025

హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సాయం కోరిన బంగ్లా

image

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!