News March 28, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

జోగులాంబ :✍️రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ సంతోష్✍️జిల్లాలో ప్రశాంతగా పది పరీక్షలు ✍️ధరూర్ :మహిళా మృతికి కారకుడైన వ్యక్తికి జీవిత ఖైదు ✍️అలంపూర్ :ఉపాధి హామీ పథకం ఉపయోగించుకోండి ✍️గద్వాల :కరపత్రాలు విడుదల చేసిన BSP నాయకులు ✍️ఇటిక్యాల :జీవాలకు టీకాలు వేయించాలి: భువనేశ్వరి ✍️KT దొడ్డి :పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ✍️అయిజ :పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై విచారణ జరపాలి.
Similar News
News April 3, 2025
పెనమలూరులో వ్యాపారి కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం హైడ్రామ చోటుచేసుకుంది. పోరంకి నారాయణపురం కాలనికి చెందిన వెంకటేశ్వరరావును, వ్యాపార విభేదాల నేపథ్యంలో భాగస్వామి రాజు తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన కుమార్తె పోలీసులకు సమాచారం అందించడంతో, వారు అప్రమత్తమై వెంటనే అతడిని కాపాడి కిడ్నాప్కు ముగింపు పలికారు.
News April 3, 2025
ఏలేరు కాలువలో ఇద్దరు యువకుల మృతి

ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఏలేరు కాలువ పొర్లు వద్ద స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం సాయంత్రం జగ్గంపేట నుంచి ఎనిమిది మంది యువకులు స్నానానికి దిగారని వారిలో ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. దేవర జీవన్ (17), మొల్లి తరుణ్ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 3, 2025
అడ్డతీగలలో పులి సంచారం.. వదంతులే: డీఆర్ఓ

అడ్డతీగల అటవీ రేంజ్ పరిధిలోని రేగులపాడులో బుధవారం పులి సంచరించిందనే సమాచారం వదంతులే అని డీఆర్ఓ రాజారావు తెలిపారు. ఆవు అనారోగ్యంతో మరణించిందన్నారు. ఆవు కళేబరాన్ని కుక్కలు పీక్కు తినడం వల్ల ప్రజలు పులి దాడి చేసిందని అనుకుంటున్నారని పేర్కొన్నారు. పులి సంచారంపై ఆ ప్రాంతంలో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ప్రజల ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.