News March 31, 2025
జోగులాంబ గద్వాల నేటి జిల్లా ముఖ్య వార్తలు

GDWL:✍️సైట్ విజిట్‌కు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్✍️ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఈద్ -ఉల్ -ఫితర్ ✍️ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి:గద్వాల ఎమ్మెల్యే✍️అయిజ: మలిదశ ఉద్యమకారుడు కన్నుమూత ✍️అలంపూర్: నేటితో మున్సిపాలిటీ LRS రాయితీ ముగింపు ✍️గద్వాల: ఆరోగ్యమే మహాభాగ్యం✍️ధరూర్: జ్యోతిరావు పూలే జయంతిని జయప్రదం చేద్దాం ✍️KT దొడ్డి: నేటితో ముగియనున్న దరఖాస్తులు✍️వడ్డేపల్లి: ప్రభుత్వము పునరాలోచించాలి.
Similar News
News November 20, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు

ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్టయిన నెల్లూరు లేడీ డాన్ అరుణకు విజయవాడ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం ఆమె జైలు నుంచి విడుదల కానుంది. గతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలోనూ, పలువురిని బెదిరించిన ఆరోపణల్లోనూ అరుణ పేరు వినిపించింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
News November 20, 2025
భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. వరికోతల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు సమాచారం, అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ల(112, 1070, 18004250101)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
News November 20, 2025
YVUలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU P.G. కళాశాల ఫైన్ ఆర్ట్స్ శాఖలో కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలు నియామకం కోసం ఈ నెల 25వ తేదీన 2 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సంప్రదించాలన్నారు.


