News February 15, 2025

జోగులాంబ: పంచాయతీ కార్యదర్శిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న ACB

image

ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ACB DSP బాలకృష్ణ కథనం మేరకు DPO శ్యామ్ సుందర్ సూచనతో ఒక వెంచర్ మేనేజర్ తో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. DPO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 20, 2025

గజ్వేల్ MLA క్యాంప్ ఆఫీసుకు TOLET బోర్డు పెట్టిన బీజేపీ

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు టూలెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఎదుట ఆకస్మికంగా ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు కేసీఆర్ గజ్వేల్ రావాలని, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.

News March 20, 2025

సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

image

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2025

HYD: ఒక్కో IPL మ్యాచ్.. రూ.1.5 కోట్లు..!

image

ఉప్పల్ స్టేడియం వెన్యూను SRH వాళ్లు రెంట్‌కు తీసుకుంటారని ప్రతి IPL మ్యాచ్ కోసం రూ.1.5 కోట్లు తమకు చెల్లిస్తారని HCA ప్రెసిడెంట్ అన్నారు. IPL మ్యాచులలో HCA పాత్ర పరిమితంగా ఉంటుందని, మిగతా వాటిల్లో HYD ఉప్పల్ స్టేడియం మొత్తం HCA కంట్రోల్లో ఉంటుందని ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. దీంతో హౌస్ కీపింగ్, క్లీనింగ్ లాంటి సదుపాయాలు కల్పిస్తామే తప్ప, టికెట్ల ధరలు తమ కంట్రోల్లో ఉండవన్నారు.

error: Content is protected !!