News February 15, 2025

జోగులాంబ: పలువురు పోలీస్ అధికారుల బదిలీలు

image

గద్వాల జిల్లాలో పలువురు పోలీసు అధికారులు బదిలీలయ్యారు. ఇటిక్యాల మండలం కోదండపురం ఎస్ఐ స్వాతి నారాయణ పేటకు VRగా బదిలీ అయ్యారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణానికి చెందిన ఎస్సై సంతోష్ వనపర్తి జిల్లా VRగా బదిలీ అయ్యారు. కాగా నాగర్ కర్నూల్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న నాగ శేఖర్ రెడ్డి శాంతినగర్ కు, నారాయణపేటలో పనిచేస్తున్న ఎస్సై మురళి కోదండపురానికి బదిలీ అయ్యారు.

Similar News

News December 3, 2025

సమ్మిట్‌కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

image

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.

News December 3, 2025

ఉప్పల్ నుంచి యాదాద్రి.. వేగంగా విస్తరణ

image

ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లే వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు అండర్ ఫ్లో వర్క్, లేన్ల విస్తరణ సైతం కొనసాగుతోంది. ప్రత్యేక ఇంజినీరింగ్ యంత్రాలతో గత నాలుగు రోజులుగా పనుల్లో మరింత వేగం పెంచినట్లుగా AEE సాయికుమార్ తెలిపారు. NHAI అధికారుల బృందం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మెటీరియల్ టెస్టింగ్ నిర్వహిస్తుంది.

News December 3, 2025

ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టాలి: CBN

image

AP: వ్యవసాయోత్పత్తులు గ్లోబల్ బ్రాండ్‌గా మారాలని తూ.గో.జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకోవాలి. ఫ్యాక్టరీలు, మార్కెట్‌తో అనుసంధానమవ్వాలి. ఏ పంటలతో ఆదాయమొస్తుంది? ఏ కాంబినేషన్ పంటలు వేయాలి? పరిశ్రమలకు అనుసంధానం ఎలా చేయాలి? రైతులే పరిశ్రమలు ఎలా పెట్టాలన్న అంశాలపై ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.