News February 15, 2025
జోగులాంబ: పలువురు పోలీస్ అధికారుల బదిలీలు

గద్వాల జిల్లాలో పలువురు పోలీసు అధికారులు బదిలీలయ్యారు. ఇటిక్యాల మండలం కోదండపురం ఎస్ఐ స్వాతి నారాయణ పేటకు VRగా బదిలీ అయ్యారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణానికి చెందిన ఎస్సై సంతోష్ వనపర్తి జిల్లా VRగా బదిలీ అయ్యారు. కాగా నాగర్ కర్నూల్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న నాగ శేఖర్ రెడ్డి శాంతినగర్ కు, నారాయణపేటలో పనిచేస్తున్న ఎస్సై మురళి కోదండపురానికి బదిలీ అయ్యారు.
Similar News
News March 6, 2026
హనుమకొండ: మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిన ఇంటర్ విద్యార్థి

హనుమకొండ జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ సెకెండియర్ పరీక్షలో ఓ విద్యార్థిని అధికారులు పట్టుకున్నారు. పరీక్ష రాస్తున్న సమయంలో మాల్‌ప్రాక్టీస్‌కు ప్రయత్నించగా ఇన్విజిలేటర్ గమనించి పట్టుకున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఏ.గోపాల్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
News March 6, 2026
హనుమకొండలో పేలిన సిలిండర్.. రేకుల ఇల్లు ధ్వంసం

హనుమకొండ జేపి నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రేకుల షెడ్డు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. హంటర్ రోడ్డు లోని వనవిజ్ఞాన్ సమీపంలో ఉన్న జేపీ నగర్‌లో నివాసం ఉంటున్న సరోజినీ శుక్రవారం ఉదయం గ్యాస్ వెలిగించగానే మంటలు రావడంతో ఇంట్లోంచి బయటకు పరిగెత్తగా మంటలు అంటుకొని సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రూ.లక్ష నగదు, తులం బంగారం దగ్ధమయ్యాయి.
News March 6, 2026
సూర్యాపేట: టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ నజరానా

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కలెక్టర్ తన సొంత ఖర్చులతో పరీక్షా కిట్లు అందించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ వీటిని పంపిణీ చేయనున్నట్లు డీఈఓ అశోక్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


