News September 25, 2024
జోగుళాంబా దేవి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే ప్రముఖులు వీరే !

అక్టోబర్ 3-12వ తేది వరకు అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, అడిషనల్ డీజీపి మహేశ్ భగవత్, ఐజీ ఎం.రమేష్, ఎండోమెంట్ కమీషనర్ హనుమంతరావు, ఏపి జితేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఈఓ పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు.
Similar News
News December 7, 2025
MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
News December 7, 2025
MBNR: సర్పంచ్ బరిలో 641 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.


