News October 14, 2024
జ్వరంతో కొడుకు మృతి.. విషాదంలో తల్లి

ఆస్పరికి చెందిన శివ(16) జ్వరంతో మృతిచెందాడు. తల్లి మహేశ్వరి హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శివకు జ్వరం రావడంతో శనివారం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భర్త భీమేష్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త, కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 6, 2025
డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సప్, స్కైప్‌ల ద్వారా వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరం జరిగితే https://cybercrime.gov.in/కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News July 5, 2025
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం: మంత్రి

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర-పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కుటుంబాల అర్హతలు పక్కాగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయలని ఆదేశించారు.