News June 24, 2024
జIలై 27 నుంచి ఎమ్మెస్సీ రెండో సెమిస్టర్ పరీక్షలు

ఏయూ పరిధిలోని ఎమ్మెస్సీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షలను జIలై 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వారీగా పరీక్షల తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం ఏయూ వెబ్సైట్ను సంప్రదించమన్నారు.
Similar News
News December 24, 2025
విశాఖలో 16వ శతాబ్ధం నాటి ఆనవాళ్లు!

విశాఖ మధురవాడ 7వ వార్డు పరిధి సుద్దగెడ్డ సమీపంలో టిడ్కో గృహాల వద్ద రహదారి విస్తరణ పనుల్లో బయటపడ్డ శ్రీరాముడి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ఫాల్గుణ రావు ఆధ్వర్యంలో బృందం స్థలాన్ని పరిశీలించి, ఈ విగ్రహం పురాతన రాతితో తయారైనదిగా, శైలి ఆధారంగా 16వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. మిగతా భాగం రాముని విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
News December 24, 2025
విశాఖ: 13 ఏళ్ల క్రితం మహిళ మిస్సింగ్.. కేసును చేధించిన పోలీసులు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పాత కేసులను రీ-ఓపెన్ చేసిన పోలీసులు ఓ మిస్సింగ్ కేసును చేధించారు. 2012లో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుక్క కుమారి అదృశ్యమయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో ఆమెను తెలంగాణలో గుర్తించారు. 13 ఏళ్ల తర్వాత ఆమెను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ టీ.కామేశ్వరరావు తెలిపారు.
News December 24, 2025
విశాఖ: రైలు ప్రయాణికులకు అలర్ట్..

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/02), రూర్కెలా-జగదల్పూర్ (18107/08), హీరాఖండ్ ఎక్స్ప్రెస్ (18447/48) రైళ్లు డిసెంబర్ 24న కోరాపుట్ వద్దే నిలిపివేయబడతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు జగదల్పూర్/కిరండూల్కు బదులుగా కోరాపుట్ నుంచే ప్రారంభమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.


