News January 3, 2025
టమాటా రైతులకు కాస్త ఊరట
పత్తికొండ టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 25కిలోల బాక్సు కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడయ్యాయి. కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా నిన్న కొంత మేర ధర పెరగడంతో ఊరట చెందారు. కిలో గరిష్ఠంగా రూ.18 పలికింది. సరాసరి రూ.15, కనిష్ఠ ధర రూ.10తో క్రయ విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 180 క్వింటాళ్ల టమాటా వచ్చింది.
Similar News
News January 26, 2025
విద్యుత్ వెలుగుల్లో కొండారెడ్డి బురుజు
76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజును జిల్లా అధికారులు సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కొండారెడ్డి బురుజుతో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికార భవనాలకు విద్యుత్ అలంకరణ చేశారు. విద్యుత్ అలంకరణతో జిల్లా గణతంత్ర శోభ సంతరించుకుంది.
News January 25, 2025
హత్యకు గురైన ఈరన్నకు వైసీపీ నేతల నివాళి
ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గ్రామంలో ఈరన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
News January 25, 2025
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య.. కేసు నమోదు
ఆలూరు మండలం అరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు ఉద్యోగ విషయంలో నెలకొన్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వదిలేయాలంటూ టీడీపీ నేతలు ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లేకుంటే హత్య చేస్తామని బెదిరించి చివరకు అన్నంతపని చేశారని వాపోయారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.