News February 22, 2025

టమోటా రైతులు అధైర్యపడకండి: కల్పనారెడ్డి

image

ప్రభుత్వమే రైతుల నుంచి గిట్టుబాటు ధరకు టమోటా కొనుగోలు చేస్తుందని టీడీపీ మహిళా నేత కల్పనారెడ్డి తెలిపారు. ములకళచెరువు టమాట మార్కెట్‌ను శుక్రవారం సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. జిల్లాలో టమాటా కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా గిట్టుబాటు ధర రైతులకు కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో టమోటాలను అన్ని ఖర్చులతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News December 1, 2025

కాక రేపుతున్న నరసరావుపేట రాజకీయాలు.!

image

రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట వైసీపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు పట్టణంలో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో 90 సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, నరసరావుపేటను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాసు ఘాటగా స్పందించారు.

News December 1, 2025

GNT: శీతాకాల సమావేశాలు.. ఎంపీ స్టాండ్ ఏంటి.!

image

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ & ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి క్యాపిటల్ రీజన్ అభివృద్ధి నిధులు, రైల్వే & రోడ్ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నూతన ప్రాజెక్టులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.

News December 1, 2025

వరంగల్‌: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

image

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.