News February 22, 2025
టమోటా రైతులు అధైర్యపడకండి: కల్పనారెడ్డి

ప్రభుత్వమే రైతుల నుంచి గిట్టుబాటు ధరకు టమోటా కొనుగోలు చేస్తుందని టీడీపీ మహిళా నేత కల్పనారెడ్డి తెలిపారు. ములకళచెరువు టమాట మార్కెట్‌ను శుక్రవారం సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. జిల్లాలో టమాటా కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా గిట్టుబాటు ధర రైతులకు కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో టమోటాలను అన్ని ఖర్చులతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News July 9, 2025
VJA: దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఈవో శీనా నాయక్ పర్యవేక్షిస్తున్నారు. నేడు ఎంతో వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయని, గంట గంటకు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోందని అధికారులు తెలిపారు.
News July 9, 2025
భువనగిరి: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరిలో జరిగింది. మోత్కూర్‌కు చెందిన నీరటి కవితకు గుండాల మండలం షాపూర్‌కు చెందిన బాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భువనగిరిలో నివాసముంటున్న కవితను భర్త తరచూ వేధించేవాడిగా తెలుస్తోంది. మానసికంగా హింసించడంతో ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News July 9, 2025
MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.