News April 11, 2024

టాటా-ఎర్నాకులం ట్రైన్ రీ షెడ్యూల్

image

సంబల్పూర్ డివిజన్‌లో సబ్ వే పనులు జరుగుతున్న కారణంగా ‌ఈనెల 13న టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ట్రైన్, ‌నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేర్ రైల్వే డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 13 ఉదయం 5.15 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ నాలుగు గంటల ఆలస్యంగా 9.15 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News March 16, 2025

విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

image

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

News March 16, 2025

విశాఖలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

విశాఖలో ఓ బాలిక తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. MVP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెంలో ఉంటున్న రమాదేవి, సురేష్ దంపతుల కుమార్తె సాయి తనూష (16) 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం గమనించిన తల్లి తనూషాను శుక్రవారం మందలించింది. దీంతో బాలిక రాత్రి రూములో తలుపులకు గడి పెట్టుకుంది. తల్లి తలుపులు కొట్టినా తీయలేదు. చివరకు తలుపులు పగలుకొట్టగా బాలిక ఉరివేసుకుని ఉంది.

News March 15, 2025

విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

image

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

error: Content is protected !!