News August 16, 2024

టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన చంద్రశేఖర్‌తో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకు సహకరించే అన్నిరకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.

Similar News

News September 19, 2024

నందిగం సురేశ్‌కు రిమాండ్ పొడిగింపు

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా TDP కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News September 19, 2024

గుంటూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్

News September 19, 2024

నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసుల పీటీ వారెంట్

image

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతిచెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేశ్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.