News October 10, 2024

టాటా మృతి దేశానికి తీరని లోటు: మంత్రి నారాయణ

image

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మంత్రి నారాయణ దిగ్ర్భాంతి చెందారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి టాటా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతుని వేడుకున్నారు.

Similar News

News February 24, 2026

నెల్లూరు: నిద్ర మాత్రలు మింగి మహిళ సూసైడ్

image

నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్డు సీపీఆర్ వీధిలో నివాసం ఉంటున్న సుజాత (51) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంట్లో సమస్యలు, అనారోగ్యం ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఈనెల 22వ తేదీన తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 24, 2026

నెల్లూరు: తొలిరోజు 566 మంది డుమ్మా

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం తొలి పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో వరప్రసాదరావు తెలిపారు. జిల్లాలో 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 26,034 మంది విద్యార్థులకు గాను 25,468 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. 566 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రకటించారు.

News February 24, 2026

నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

image

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్‌గా, నూరుల్లా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.