News February 15, 2025

టాప్‌లో ఎన్టీఆర్ జిల్లా

image

స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యకలాపాల అమలులో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది. ఈ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చామని సీఎం చంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఈ జాబితాలో టాప్‌లో ఉండగా, అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News November 21, 2025

పకడ్బందీగా పంట కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో అన్ని పంటల కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పంటల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి, సోయా, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అన్ని పంటలను కొనుగోలు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

News November 21, 2025

ADB: జాతీయ రహదారిని అడ్డుకోవడం చట్టరీత్య నేరం: డీఎస్పీ

image

జాతీయ రహదారిపై అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని వాటిని అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని ADB డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. యువత కేసుల బారిన పడకుండా వారి భవిష్యత్తులను నాశనం చేసుకోకూడదని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక, వాహనాలు ఆస్పత్రిలకు వెళ్లేవారికి అసౌకర్యం కలిగే చర్యలు చేయవద్దన్నారు. యువత కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోకుండా ఉండాలని సూచించారు.

News November 21, 2025

మూవీ అప్డేట్స్

image

* విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ డిసెంబర్ 15న సెట్స్‌పైకి వెళ్లే అవకాశం. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో తన కామియో షూటింగ్ పూర్తి కాగానే వెంకటేశ్ ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతారని టాక్.
* ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ మ్యాన్-3. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.
* ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని రాజాసాబ్ టీమ్ వెల్లడి.