News December 14, 2024
టామాటా కిలో కనిష్ఠ ధర రూ.4కు కొనుగోలు చేయండి: జేసీ
పత్తికొండ టమోటా మార్కెట్లో రైతుల నుంచి టమోటా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 42 ఉత్పత్తులు వచ్చాయని, ఇందులో 13 టన్నులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టమోటా కిలో కనిష్ఠ ధర రూ.4 లకు కొనుగోలు చేయాలని ఆదేశించారు.
Similar News
News December 27, 2024
వైసీపీకి ఇంతియాజ్ రాజీనామా
విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News December 27, 2024
కర్నూలు: 58వ సారి రక్తదానం
కర్నూలులోని ఓ ఆసుపత్రిలో హనుమంతు అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీని సంప్రదించారు. ఆ సొసైటీ అధ్యక్షుడు గందాలం మణికుమార్ స్పందించారు. 58వ సారి ఆయన రక్తదానం చేశారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు.
News December 27, 2024
శ్రీశైలంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కోరారు. శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ సిఫార్సు లేఖలను తిరుమలలో యాక్సెప్ట్ చేయాలి. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. TTD తరఫున తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అని సురేఖ కోరారు.