News March 22, 2024
టికెట్ కోసం ప్రయత్నించలేదు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం

భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని ఇక్కడి నుంచి బరిలో నిలిపేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఎంపీ టికెట్ కోసం తన భార్య ప్రయత్నించలేదని అన్నారు. పార్టీ ఆదేశిస్తే తన భార్య పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.
Similar News
News December 4, 2025
శాలౌగారారం: కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవం

SLG సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 11మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి కాంగ్రెస్, BRS సానుభూతిపరులు ఒక్కొక్కరు మాత్రమే బరిలో నిలిచారు. చివరి క్షణంలో BRS మద్దతుదారు గుజిలాల్ శేఖర్ బాబు కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదృష్టం అంటే ఈయనదే మరి. ఏమంటారు మీరు.
News December 4, 2025
నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్‌ను పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నార్కట్‌పల్లి–యల్లారెడ్డిగూడెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పారు. ఘర్షణలు, ప్రలోభాలు, నగదు పంపిణీపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.