News April 8, 2024
టికెట్ మార్పుపై సర్వే చేపట్టడం సంతోషం: కలమట

పాతపట్నం నియోజకవర్గ TDP టికెట్ మార్పు విషయంపై పునఃపరిశీలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం ఐవీఆర్ఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయని స్పష్టం చేశారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు TDP అధిష్ఠానం ఉదయం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతుందన్నారు. సీక్రెట్‌గా సర్వే చేయడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే పాతపట్నం టికెట్ మామిడికి టీడీపీ కేటాయించిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 26, 2025
టెక్కలి: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.