News February 21, 2025
టీచర్గా మారిన కలెక్టర్.. తాను చెబుతూ పిల్లలతో చెప్పిస్తూ..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టీచర్గా మారారు. విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బోధించారు. విద్యార్థులతో పాఠాలు బోధించేలా చేశారు. వారితో మమేకమై పోయారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహ భోజనం చేశారు. ఈ పరిణామం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎల్లారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఈ సంఘటన గురువారం జరిగింది.
Similar News
News December 17, 2025
ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల

AP: ప్రజల ప్రాణాలతో CM చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల ప్రతులను పరిశీలించారు. పీపీపీ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. ప్రైవేటులో ఫ్రీగా వైద్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొంత ఖర్చు చేసినా కాలేజీలు పూర్తవుతాయన్నారు.
News December 17, 2025
తూ.గో: బహిర్భూమికి వెళ్లి వ్యక్తి మృతి

బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నందంపూడిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మిద్దెల సత్తిబాబు బుధవారం ఉదయం అంబాజీపేట మురుగు కాలువ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయాడు. ఊబిలో దిగబడి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News December 17, 2025
ఖమ్మం: తల్లిపై సర్పంచిగా గెలిచిన కూతురు

పెనుబల్లి సర్పంచి పదవి కోసం తలపడిన తల్లిపై కుమార్తె విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన కుమార్తె బానోతు పాపా.. కాంగ్రెస్ బలపరిచిన తన తల్లి తేజావత్ సామ్రాజ్యంపై 536 ఓట్లతో ఘనవిజయం సాధించారు. రాజకీయ పోరులో భాగంగా తల్లీకూతుళ్లు ప్రత్యర్థులుగా నిలిచినప్పటికీ, తుది ఫలితం మాత్రం కుమార్తెను వరించింది. ఈ విలక్షణ పోరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


