News January 30, 2025
టీచర్ల తప్పుల సవరణకు అవకాశం: DEO

టీచర్ ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్ (TIS) పూర్తి వివరాలను www.cse.ap.gov.in వెబ్ సైట్లో ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ ద్వారా పొందుపర్చి ఉన్నట్లు గుంటూరు డీఈవో సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎడిట్/మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించామని అన్నారు. తప్పులు సవరణ చేసుకోదలచిన ఉపాధ్యాయులు 30వ తేదీ సాయంత్రం 5గం.ల లోపు చేసుకోవాలని డీఈవో సూచించారు.
Similar News
News February 14, 2025
సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం

నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఆయన చిత్రటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమన్నారు. ఆ మహానుభావుడి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.
News February 14, 2025
‘ఉమ్మడి గుంటూరులో దడపుట్టిస్తున్న జీబీఎస్’

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జీజీహెచ్‌లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రాలోని పూణేలో 172 జీబీఎస్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. శ్రీకాళంలో పదేళ్ళ బాలుడు మృతి చెందినప్పటి నుంచి ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఊపిరి అందకపోవడం, గొంతు మింగుడు పడకపోవడం, చేతులు, కాళ్ళు చచ్చుపడటం జీబీఎస్ ప్రధాన లక్షణాలు.
News February 14, 2025
ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త: బజరంగదళ్

వాలంటైన్స్ డే పేరు చెప్పుకొని విచ్చలవిడిగా తిరిగే ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని గుంటూరు జిల్లా బజరంగదళ్ నాయకులు హెచ్చరించారు. ఫిబ్రవరి 14 అంటే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మన జవాన్లు దారుణంగా మృతిచెందిన రోజని చెప్పారు. ఇది సంతాపదినమే కానీ ప్రేమికుల దినోత్సవం కాదన్నారు. విచ్చలవిడితనానికి, లవ్ జిహాదీకి తాము వ్యతిరేకమని, ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణగా ఉంటామన్నారు.