News March 3, 2025
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్యకు 7600 ఓట్లు

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమరయ్య భారీగా ఓట్లు సాధించారు. బీజేపీ, తపస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ మల్కా కొమురయ్య మొదటి 14 టేబుల్లో 14,000 ఓట్లు కౌంటింగ్ జరిగితే దాదాపు 7600 ఓట్లు మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లు పోల్ అయ్యాయి.
Similar News
News September 18, 2025
బతుకమ్మ వేడుకలు.. దద్దరిల్లనున్న ట్రై సిటీ!

బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News September 18, 2025
ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం ఎప్పుడో?

కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియ ఆస్పత్రిని 2015లో పరిశీలించి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆస్పత్రికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియాకు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకు నాయకులు ప్రకటించడమే గానీ వైభవం తెచ్చేలా ఎవరూ పనిచేయడం లేదు. ఇలా ఉంది మన పాలకుల తీరని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News September 18, 2025
HYD: ఒకే రోజు.. ఒక్కో తీరు.. ఇదే విచిత్రం!

సెప్టెంబరు 17.. HYD చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. నిజాం పాలనుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందిన ప్రత్యేక సందర్భం. అయితే ఈ వేడుకను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో చేసుకుంది. అధికార పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవం, బీజేపీ హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట వేడుకలు జరిపాయి. వీరంతా కలిసి చేసింది ప్రజల విజయాన్నే!