News June 14, 2024

టీచర్ నుంచి హోంమంత్రిగా అనిత

image

వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మంత్రిగా అనిత ఉన్నారు. పాయకరావుపేట నియోజకర్గం నుంచి మొదటి మంత్రి అనితే కావడం గమనార్హం. టీచర్ పనిచేసిన అనిత 2014లో మొదటిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 కొవ్వురులో పోటీ చేసి మాజీ హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓడిన అనితను హోంమంత్రి వరించడం విశేషం.

Similar News

News November 7, 2025

విశాఖ రేంజ్‌లో వందేమాతరం గీతాలాపన

image

విశాఖ రేంజ్‌ పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ‘వందేమాతరం’ గీతాలాపన చేశారు. జాతీయ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీఐజీ గోపీనాథ్‌ జెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సూచించారు.

News November 7, 2025

విశాఖ: ఎయిర్‌పోర్ట్ రహదారిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

షీలానగర్ నుంచి ఎన్ఏడీ వైపు వస్తున్న రహదారిలో శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీస్తున్నారు.

News November 7, 2025

విశాఖ కలెక్టరేట్లో వందేమాతరం వేడుకలు

image

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం వందేమాతరం గీతాన్న ఆలపించారు. బంకించందర చటర్జి వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉన్నతాధికారితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం స్వతంత్ర్య స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.