News February 10, 2025
టీచర్ MLC అభ్యర్థిగా మల్లారెడ్డి నామినేషన్ దాఖలు

సిద్దిపేటకు చెందిన జగ్గు మల్లారెడ్డి టీచర్ MLC అభ్యర్థిగా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ ఉన్నందున తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. తనకు మద్దతిచ్చి గెలిపిస్తే చట్టసభల్లో తన గొంతు వినిపిస్తానన్నారు. రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
Similar News
News December 16, 2025
జంగారెడ్డిగూడెం: లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు

జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికపై ఆమె మారుతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ముద్దాయిపై రౌడీ షీట్ కూడా తెరుస్తున్నామని పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
News December 16, 2025
క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.
News December 16, 2025
నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.


