News December 27, 2024
టీజీ భరత్ కుమార్తె పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ
మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్యపాన్య వివాహ వేడుక హైదరాబాదులోని GMR అరేనలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ హాజరై సందడి చేశారు. నూతన వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు బాలయ్యతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Similar News
News January 26, 2025
టికే ఆర్ శర్మ సేవలు చిరస్మరణీయం: డీవీఆర్
గాంధీయవాది టీకేఆర్ శర్మ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి డీవీఆర్ సాయి గోపాల్ అన్నారు. శనివారం యూనివర్సిటీ ప్రాంగణంలో టీకేఆర్ శర్మ శతజయంతి ఉత్సవాల బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలను ఈనెల 30న కర్నూలులోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు సంస్థ సంయుక్తా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.
News January 26, 2025
విద్యుత్ వెలుగుల్లో కొండారెడ్డి బురుజు
76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజును జిల్లా అధికారులు సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కొండారెడ్డి బురుజుతో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికార భవనాలకు విద్యుత్ అలంకరణ చేశారు. విద్యుత్ అలంకరణతో జిల్లా గణతంత్ర శోభ సంతరించుకుంది.
News January 25, 2025
హత్యకు గురైన ఈరన్నకు వైసీపీ నేతల నివాళి
ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గ్రామంలో ఈరన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.