News January 9, 2025
టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే: గుడివాడ

తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ వైసీపీ ఆఫీసులో గురువారం మాట్లాడారు. టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే అన్నారు. అధికార యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించామని గుర్తు చేశారు.
Similar News
News September 16, 2025
విశాఖ: వృద్ధురాలిని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

వృద్ధురాలి డబ్బులు దోచేసిన ముగ్గురిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ నగర్లో ఉంటున్న వృద్ధురాలికి ఈ ఏడాది మే 16న ఫోన్ చేసి బంధువులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె నుంచి ధఫదపాలుగా రూ.4 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. డబ్బలు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఖాతాల ఆధారంగా రాజస్థాన్‌కి చెందిన మొయినుద్దీన్, గణేశ్, దినేశ్‌ను పట్టుకున్నారు.
News September 16, 2025
నేటి నుంచి జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర

జీవీఎంసీ కార్పొరేటర్లు మంగళవారం అధ్యయన యాత్రలో పాల్గొననున్నరు. ఈ ప్రయాణంలో భాగంగా రేపు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆజ్మీర్, జోద్పూర్ నగరాల్లో పర్యటించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. కార్పొరేటర్ల బృందం ఈనెల 24న తిరిగి విశాఖకి చేరుకుంటుంది.
News September 16, 2025
విశాఖ: 19న జాబ్ మేళా

కంచరపాలెం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్సీఎస్సీ)లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి శ్యాం సుందర్ తెలిపారు. బీపీవో, రిలేషిప్ మేనేజర్, టెలీకాలింగ్ ఆపరేటర్ విభాగాల్లో సుమారు 100 ఉద్యోగాలకు డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పాస్ అయిన నిరుద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు. 19న ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.