News December 7, 2024

టీటీడీ చైర్మన్‌ను కలిసిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు

image

టీటీడీ చైర్మన్‌ను శాప్ ఛైర్మన్ రవినాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస స్పోర్స్ కాంప్లెక్స్ ఆధునీకరణ, హాకీ అకాడమీ పునరుద్ధరణకు టీటీడీ తరపున సహాయ సహకారం అందించాలని చైర్మన్‌ను కోరుతూ రవినాయుడు వినతిపత్రం ఇచ్చారు. రవినాయుడు వినతిపై టీటీడీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు, క్రీడాకారులకు ఉపయోగకరంగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఛైర్మన్ ఇచ్చారన్నారు.

Similar News

News January 21, 2025

తిరుపతి SVUలో చిరుత కలకలం

image

తిరుపతిలోని ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్‌ బ్లాక్‌ ప్రాంతంలో విద్యార్థులకు చిరుత కనిపించిందని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫారెస్ట్‌ అధికారులకు యూనివర్సిటి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కుక్కలు, దుప్పిల కోసం చిరుత వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వేదిక్ యూనివర్సిటీలో పాద ముద్రలు ఉన్నట్లు గుర్తించారు.

News January 20, 2025

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు

image

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్‌పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

News January 20, 2025

చిత్తూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

image

కలిచర్లలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. పెద్దమండెం మండలం, ఖాదర్ షరీఫ్ కుమారుడు ఉస్మాన్(21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉస్మాన్ ఊరికి సమీపంలోనే ప్రభుత్వ కళాశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్ద చెట్లపొదల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.