News June 20, 2024

టీటీడీ ఛైర్మన్‌గా ఏలూరి సాంబశివరావు.?

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రి మండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.

Similar News

News September 18, 2024

ఒంగోలు: నిరుద్యోగ మహిళలకు GOOD NEWS

image

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 01 వరకు, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19- 45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.

News September 18, 2024

పోషకాహార లోపంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలెవరూ పోషకాహార లోపంతో బాధపడకూడదని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలో ఐసీడీఎస్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వయస్సుకు తగినట్టుగా ఎత్తు, బరువు ఉండేలా తగిన ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం కచ్చితంగా అందేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

News September 18, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులతో ప్రకాశం కలెక్టర్ సమీక్ష

image

ఆస్పత్రులలో పారిశుద్ధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా ఆస్పత్రుల వారీగా ఉన్న సిబ్బంది విధుల కేటాయింపు, పారిశుద్ధ్యం, భద్రత, వివిధ పనులలో పురోగతిపై చర్చించారు. హెచ్.డి.ఎస్. నిధుల లభ్యత, ఎన్.టి.ఆర్. వైద్య సేవలు లభిస్తున్న తీరు తదితరాలపై సమీక్షించారు.