News October 30, 2024

టీటీడీ నూతన ఛైర్మన్‌ది చిత్తూరు జిల్లానే..

image

TTD నూతన ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడిది చిత్తూరు జిల్లానే. పెనుమూరు మం. దిగువ పూనేపల్లిలో మునిస్వామి నాయుడు-లక్ష్మి దంపతులకు 1952 సెప్టెంబరు 15న జన్నించారు. రైతు కుటుంబంలో జన్నించిన ఆయన ఉన్నత చదువులు చదివారు. తొలి రోజుల్లో బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగం చేశారు. బిజినెస్‌పై ఆసక్తితో ట్రావెల్ క్లబ్ పేరుతో ఎయిర్ టికెట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. తర్వాత టీవీ5 సంస్థను స్థాపించి వ్యాపారాన్ని విస్తరించారు.

Similar News

News September 18, 2025

కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

image

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.

News September 18, 2025

చిత్తూరు: రెండేళ్ల క్రితం హత్య.. ఇప్పుడు వెలుగులోకి

image

బంగారుపాళ్యం(M) బలిజపల్లికి చెందిన చెంచులక్ష్మి భర్త చనిపోగా శేషాపురానికి చెందిన దేవేంద్రతో వివాహేతర బంధం ఏర్పడింది. పెనుమూరు(M) సామిరెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో కాపలా పనికి 2023లో ఇద్దరు వచ్చారు. అప్పట్లోనే వాళ్ల మధ్య గొడవ జరగ్గా చెంచులక్ష్మిని దేవేంద్ర నీటిలో ముంచి చంపేశాడు. తోటలోనే డెడ్‌బాడీని పాతిపెట్టి ఆమె ఎటో వెళ్లిపోయిందని మృతురాలి తల్లిని నమ్మించాడు. పోలీసులు నిన్న అతడిని అరెస్ట్ చేశారు.

News September 18, 2025

అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోండి: DMHO

image

పారామెడికల్ ట్రైనింగ్ 2025-26 కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అక్టోబర్ 4 వరకు గడువు పెంచినట్లు DMHO సుధారాణి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.appmb.co.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్లను జత చేసి రూ.100లను DMHO కార్యాలయంలో అందించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.