News October 31, 2024

టీటీడీ బోర్డు సభ్యుడిగా సిక్కోలు వాసి

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్టింగ్‌తో ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణ చీఫ్ డిజైనర్‌గానూ పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఆ పార్టీ కోటాలో బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు.

Similar News

News December 2, 2025

తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

image

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

News December 2, 2025

HIVకి భయపడవద్దు: శ్రీకాకుళం కలెక్టర్

image

హెచ్ఐవికి భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలని, వారిపట్ల వివక్ష చూపరాదని సూచించారు. రిస్క్ గ్రూపులకు చెందినవారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు.