News June 29, 2024

టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం..?

image

టీటీడీ ఆన్‌లైన్ సేవలకు ఆధార్‌ లింక్ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయమై ఈవో శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో UIDAI అధికారులతో సమావేశమయ్యారు. ‘టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలను ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ దళారుల బెడద తప్పడం లేదు. ఆధార్ లింక్ ద్వారా మోసాలను అరికట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి’ అని టీటీడీ ఐటీ అధికారులకు ఈవో సూచించారు.

Similar News

News October 5, 2024

సీఎం చంద్రబాబుకు వీడ్కోలు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగించుకొని శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగుపయనమయ్యారు. ఆయనకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 5, 2024

వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన చంద్రబాబు

image

తిరుమల పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 1.20 లక్షల మంది భక్తులకు సరిపడే విధంగా భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.

News October 5, 2024

సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వకుళమాత నూతన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే టీటీడీ అధికారులతో సమావేశం అయి తర్వాత తిరుగు ప్రయాణం కానున్నారు. లడ్డూ వ్యవహారం అనంతరం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.